శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలను విజయవంతం చేయండి..

0
218

–సిరిసల్ల మున్సిపాల్ చైర్మన్ జిందం కళ చక్రపాణి

బలగం టివి,సిరిసిల్ల:

శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి జయంత ఉత్సవాలలో సిరిసిల్ల ప్రజలు, పద్మశాలి కుల బాంధవులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో  పాల్గొని విజయవంతం చేయాలని మున్సిపాల్ చైర్మన్ జిందం కళ చక్రపాణి పిలుపునిచ్చారు.శనివారం  సిరిసిల్ల పట్టణంలోని పద్మశాలి సంఘ కార్యాలయంలో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలు మరియు శివ భక్త మార్కండేయ స్వామి శోభాయాత్ర ఆహ్వాన కరపత్రాలను పద్మశాలి సంఘం అధ్యక్షుడు   గోలి వెంకటరమణ టిఎస్పిటిడిసి మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ తో  కలసి మున్సిపాల్ చైర్మన్ కళ చక్రపాణి అవిష్కరించారు.ఈ సందర్బంగా జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ.ఈనెల 12వ తేదీ సిరిసిల్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో  మార్కండేయ జయంతి ఉత్సవాలను  ఘనంగా నిర్వహించేదకు, పద్మశాలి సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు.ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడ శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలలో భాగంగా శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో ఉదయం నిర్వహించే హోమ పూజా కార్యక్రమాల నుండి సాయంత్రం సాయంత్రం 4 గంటల 5 నిమిషాల నుండి సిరిసిల్ల పట్టణంలో వైభవంగా నిర్వహించే శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి శోభాయాత్ర మహోత్సవంలో  సిరిసిల్ల ప్రజలు పద్మశాలి కుల బాంధవులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో  పాల్గొనాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు గాజుల బాలయ్య ,పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు మండలి సత్యం,, పద్మశాలి సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు కామిని వనిత, బోల్లి రామ్మోహన్ ,యేల్ల లక్ష్మీనారాయణ, గుజ్జే తార, మోర రవి, రాపల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here