బలగం టివి, ,రాజన్న సిరిసిల్ల :
ఈనెల 13న హైదరాబాదులో జరిగే ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మరియు ఎం ఎస్ పి అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాదులో జరిగే ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల జాతీయ సమావేశం నాకు మాదిగ మాదిగ ఉప కులాల నాయకులు మరియు కుల బంధువులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో కొన్ని ఏళ్లగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నామని, త్వరలోనే పోరాటం నుంచి విముక్తి పొందబోతున్నం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మేము చట్టబద్ధత చేయడానికి అనుకూలంగా ఉన్నదని, కొద్ది రోజుల్లోనే మనం వర్గీకరణ సాధించకపోతున్నా మని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఆవునూర్ ప్రభాకర్ మాదిగ,ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కానాపురం లక్ష్మి మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ ఎలగందుల బిక్షపతి మాదిగ,ఎం ఎస్ పి జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లారం చంద్రమౌళి, ఎమ్మార్పీఎస్ కో కన్వీనర్ పసుల కమలాకర్, నాయకులు నేరెళ్ల శ్రీనివాస మాదిగ, చంద్రమౌళి నేదూరి బాబు కలకోట రవి బాబు చిట్యాల మధు మరియు తదితరులు పాల్గొన్నారు.