రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

0
111

జూకంటి జగన్నాథం

బలగం టివి,సిరిసిల్ల:

హైదరాబాద్ లో ఈ నెల 25 న  జరిగే తెలంగాణ రచయితల వేదిక ఎనిమిదవ రాష్ట్ర మహాసభల ను విజయవంతం చేయాలని తెలంగాణ రచయిత ల వేదిక జాతీయ అధ్యక్షులు జూకంటి జగన్నాథం పిలుపునిచ్చారు.శుక్రవారం సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర మహాసభల పోస్టర్ ను జూకంటి జగన్నాథం అవిష్కరించారు .ఈ సందర్బంగా జాకంటి జగన్నాథం మాట్లాడుతూ హైదరాబాదులోని  బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రజాకవి గద్దర్ వేదికగా తెలంగాణ రచయితల వేదిక ఎనిమిదవ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ  మహాసభలకి జిల్లాలోని యువకులు, మేధావులు, కవులు, కళాకారులు మరియ రచయితలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని అన్నారు.ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా 14 అక్టోబర్ 2001లో కార్యచరణ రూపొందించుకొని జనవరి 6న 2002లో తెలంగాణ రచయితల వేదిక ఆవిర్భవించి,ఉద్యమ కాలంలో తెలంగాణ సమాజానికి దిక్సూచిగా వ్యవహరించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రచయితల వేదిక ఎనలేని కృషి చేసిందని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆడేపు లక్ష్మణ్ ,జిల్లా అధ్యక్షుడు  వెంగలి నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పాకాల శంకర్ గౌడ్, పురుషోత్తం, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here