టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాతూరి మహేందర్ రెడ్డి
బలగంటివి,సిరిసిల్ల :
ఖమ్మంలో ఈనెల 11, 12 తేదీలలో జరిగే టిపిటిఎఫ్ ద్వితీయ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర టిపిటిఎ ఉపాధ్యక్షుడు పాతూరి మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.శని వారం సిరిసిల్ల పట్టణం శివనగర్ లోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యా వైజ్ఞానిక మహాసభల పోస్టర్ ను టిచర్ లతో కలసి పాతూరి మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాతూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ మహాసభలు ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడతాయని, ఎన్నో విషయాలను నేర్చుకుంటారని అన్నారు. కావున ఉపాధ్యాయులు ఇట్టి మహాసభల్లో అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో టిపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లారపు పురుషోత్తం, పాఠశాల ఇన్ చార్జి హెచ్ ఎం డి రవీందర్, బి. గోవిందరావు,లక్ష్మయ్య, శ్రీహరి, సమ్మయ్య నసీర్, సాంబయ్య,అజయ్, వెంకటేశం, దేవరాజ, సరిత, ఏ జ జ్ ఫాతిమా, సంధ్యారాణి, సూర్య కళ, నీరజ ఉపాధ్యాయునిలు పాల్గొన్నారు.