వడ్డెర మహాసభ ను విజయవంతం చేయండి..

0
196

బలగం టివి,సిరిసిల్ల:

అదివారం హైదరాబాదులో ని రవీంద్ర భారతి లో జరిగే వడ్డెర మహాసభను    విజయవంతం చేయలనీ  రాజన్న సిరిసిల్ల జిల్లా  వడ్డెర సంఘం అధ్యక్షుడు  సూర దేవరాజు పిలుపునిచ్చారు.శని వారం సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో వడ్డెర మహాసభ వాల్ పోస్టర్లను వడ్డెర సంఘం  నాయకులతో కలసి రాజన్న సిరిసిల్ల జిల్లా  వడ్డెర సంఘం అధ్యక్షుడు  సూర దేవరాజు ఆవిష్కరించారు.ఈ సందర్బంగా  సూర దేవరాజు మాట్లాడుతూ వడ్డెరలు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని ,రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ లు, సర్పంచ్ ల  ఎంపిటిసిలు మరియు  జడ్పిటిసిలు గా ఎదగాలని  .అప్పుడే వడ్డెరలకు రాజకీయంగా గుర్తింపు ఉంటుందని  అన్నారు.మైనింగ్ కాంట్రాక్ట్ లో వడ్డెర్లకు రిజర్వేషన్ కల్పించాలని  కోరారు.వడ్డెర ఓబన్న జేఏసీ జిల్లా అధ్యక్షులు రమేష్ గోగుల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వడ్డెర్లకు  నామినేటెడ్ పోస్టులో ప్రాధాన్యత కల్పించాలని ,అన్ని  రాజకీయ పార్టీలు ఎలక్షన్  కాకుండా మిగతా టైములో కూడా వడ్డెరులు గుర్తు ఉండేలాగా  ప్రాధాన్యత కల్పించాలని అన్నారు అదివారం జరిగే మహాసభ  జిల్లాలోని వడ్డెరులు విజయంవతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర  కార్మిక ప్రధాన కార్యదర్శి పీట్ల వెంకటేశం, రాష్ట్ర ఉపాధ్యక్షులు దండగుల తిరుపతి ,జిల్లా గౌరవ అధ్యక్షుడు కొమ్మురాజుల ఐలయ్య ,జిల్లా ప్రధాన కార్యదర్శి సల్లంగుల బాలకృష్ణ .సిరిసిల్ల నియోజకవర్గం  అధ్యక్షులు ధారంగుల ఎల్లయ్య వివిధ మండ​ల అధ్యక్షులు  శివరాత్రి లక్ష్మణ్, వల్లేపు రజనీకాంత్ , దుర్గయ్య , గండ్ల అంజి . అంజయ్య. వేముల రాములు ,సూర రాము ,తిరుపతి తదితరులు పాల్గొన్నారు,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here