నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులను సన్మానించిన మాల ఐక్యవేదిక జిల్లా నాయకులు

0
59

బలగం టీవీ, వేములవాడ:

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ పండుగ శంకర్, రెండవ వార్డు సభ్యుడిగా ఎన్నికైన పండుగ పర్శరాములను అభినందించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని. గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారానికి తమ వంతు బాధ్యతగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామని. మాల ఐక్యవేదిక జిల్లా నాయకుల ఆధ్వర్యంలో నూతన ప్రజాప్రతినిధులను సన్మానించడం చాలా సంతోషదాయకమని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు నీరటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మూలే కిషోర్, మాలల ఐక్యవేదిక కన్వీనర్ తుంగ శివరాజ్, కో-కన్వీనర్ జక్కుల యాదగిరి, వేములవాడ అర్బన్ మండల అధ్యక్షుడు వంకాల మహేశ్వర్, ఉపాధ్యక్షుడు పండుగ నిరంజన్, మాజీ ఎంపీటీసీ పండుగ ప్రమీల, వీరేందర్ ఆధ్వర్యంలో పాల్గొన్నారు. అలాగే అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పండుగ సుమన్, మాజీ అధ్యక్షుడు పండుగ నర్సింహా స్వామి, అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ సభ్యుడు పండుగ అంజయ్య, అంబేద్కర్ ఆదర్శ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here