ఎస్సీలలోని 58 కులాలకు న్యాయం చేయాలని డిమాండ్
బలగం టీవీ, హైదరాబాద్:
ఎస్సీ వర్గీకరణ సవరణ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి, ఎస్సీలలోని మొత్తం 59 కులాలలో 58 కులాలకు న్యాయం చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్ డిమాండ్ చేశారు. శనివారం రోజున భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బేర బాలకిషన్ ఆధ్వర్యంలో మాల సంఘాల నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అక్కడికి వచ్చిన సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల JAC మాల సంఘాల గౌరవ చైర్మన్ చెరుకు రామచందర్, scrps జాతీయ అధ్యక్షులు బిఎస్ఎన్ఎల్ బాలకృష్ణ గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో హైదరాబాదులోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మాల సంఘాల నాయకులు ఆయన ముందు నిరసన తెలిపారు. ఎస్సీ వర్గీకరణ వల్ల నష్టపోతున్న తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి, రాష్ట్రంలోని 30 లక్షల మంది మాలలకు న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు.
ఎస్సీ వర్గీకరణ సవరణ చట్టాన్ని తక్షణమే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని, ఎస్సీ వర్గీకరణ వల్ల నష్టపోతున్న 58 కులాలకు న్యాయం చేయాలని, జీవో నెంబర్ 99ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ గౌరవ చైర్మన్ చెరుకు రామచందర్, SCRPS జాతీయ అధ్యక్షులు బి.ఎస్.ఎన్.ఎల్. బాలకృష్ణతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ నాయకులు నాలుకల నర్సింగ్ రావు, గంగాధర్, రాంనగర్ మల్లేష్, భుజంగరావు, మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.




