బలగం టివి, కోనరవుపెట్
జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి.
మాఘ అమావాస్య సందర్భంగా కోనరవుపెట్ మండలం మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి జాతరను ప్రారంభించి, ప్రత్యేక పూజలు చేసిన జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి. అనంతరం అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలను అందించారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ మాఘ అమావాస్య సందర్భoగా ప్రతి సంవత్సరం శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయం లో జాతర మహోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా టాయిలెట్స్, పందిర్లు, తాగునీరు సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి భగవంతునినీ దర్శించుకుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో విజయ్ ప్రకాష్ రావు, మాజీ సర్పంచు కొక్కుల భారత నర్సయ్య, శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం సుపెరిండేoట్ శ్రీరాములు, గోలి శ్రీనివాస్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.