బలగం టీవి, బోయినిపల్లి :
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లిమండలం నీలోజిపల్లి గ్రామానికి చెందిన గుండ్ల కనకయ్య (47) శుక్రవారం రోజున తెల్లవారి జామున వారి ఇంటి లోపల ఎవరు లేని సమయంలో తాడుతోని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.పక్కన ఉన్న ఇంటి వాళ్ళు ఇంకా బయటికి రాలేదని ఇంటి లోపలికి వెళ్ళి చూసే సరికి ఉరి వేసుకొని చనిపోయి ఉన్నాడని, స్థానికులు మృతుడి భార్య గుండ్ల మంగకు తెలిపారు. హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. మృతుడు కనకయ్య గత కొద్ది రోజులుగా కరీంనగర్ లో ప్రైవేట్ జాబు చేసుకుంటు జీవనం గడుపుతున్నారు. గతంలో మిడ్ మానేరు ముంపు గ్రామాలలో ఇల్లు మునిగిపోవడంతో నీలోజిపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఇల్లు కట్టుకోవడానికి అప్పులు చేశాడు. ఉపాధి లేకపోవడంతో అప్పులు పెరిగి, చేసిన జీతం సరిపోక, అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురై ఇంటిలోనే ఉరి వేసుకొని చనిపోయాడు. మృతుడి భార్య మంగ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మండల ఎస్సై మహేందర్ తెలిపారు.