బలగంటివి,
తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మాత్యులు నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా, చెన్నూరు మాజీ శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ అధ్యక్షతన క్యాతనపల్లి లోని వారి ఇంటి వద్ద చెన్నూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశానికి ఎమ్మెల్సీ దండే విఠల్ , మంచిర్యాల మాజీ శాసనసభ్యులు దివాకర్ , మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ , మాజీ మంత్రివర్యులు బోడ జనార్ధన్ , నాయకులు అందుగుల శ్రీను పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, యువజన, విద్యార్థి, మహిళ, సోషల్ మీడియా వారియర్స్, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
