బలగం టివి ,
టి పి ఎల్ ఫైనల్ విజేత ఎల్లారెడ్డి పేట్ వీర్నపల్లి టీం
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు
దివంగత ఎం ఈ ఓ మంకు రాజయ్య సేవలు చిరస్మరనీయం అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు అన్నారు, ఆదివారం రోజున బోనాల గ్రౌండ్ లో జరిగిన మంకు రాజయ్య స్మారక టీచర్స్ ప్రీమియం లీగ్ ఫైనల్ విజేత లకు ముఖ్య అతిధి గా హాజరైన పర్శ హన్మాండ్లు ట్రోపి అందజేశారు, ఈ సందర్బంగా ముఖ్య అతిధి పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ విద్యా సంస్కర్త గా సామాజిక సేవకుడికిగా మహనీయుల సరసన మంకు రాజయ్య చేరినాడని పర్శ హన్మాండ్లు అన్నారు, మంకు రాజయ్య విద్యా రంగానికి చేసిన సేవలకు గాను ఎల్లారెడ్డి పేట్ మండల వనరుల కేంద్రాన్ని మంకు రాజయ్య స్మారక వనరుల కేంద్రం గా మార్చాలని ప్రభుత్వాన్ని కోరుతు ఆయన విగ్రాన్ని జిల్లా కేంద్రం లో ఏర్పాటు చేయాలని పర్శ హన్మాండ్లు డిమాండ్ చేశారు, మంకు రాజయ్య ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలని ఉపాధ్యాయులకు పర్శ హన్మాండ్లు పిలుపునిచ్చారు, ఈ సమావేశం లో శర్మన్ నాయక్, నవీన్, భాస్కర్ రెడ్డి, బాల్ రెడ్డి, గోపాల్, శ్రీకాంత్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు