బలగం టివి, వేములవాడ
గత 20 రోజుల నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో జరిగిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది..
ఇట్టి టోర్నమెంట్లో షాదబ్ Xlవిన్నర్స్ గా నిలవగా,రన్నర్స్ గా అను పర్షి Xl నిలిచింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ,మహిళ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రేగుల రేణుక మరియు రేగుల శ్రీకాంత్ పాల్గోని విన్నర్స్ షాదబ్ xl టీం కి ప్రథమ బహుమతి 20,000 రూపాయలు,రన్నర్స్ అను పర్షి Xl టీం కి ద్వితీయ బహుమతి 10,000 రూపాయలు అందించారు.
ఇట్టి టోర్నమెంట్ విజయవంతంగా జరిపించిన టోర్నీ నిర్వాహకులకు పలువురు అభినందించారు
