*ఘనంగా శోభయాత్ర నిర్వహించిన పద్మశాలీలు.
బలగం టివి ,,ముస్తాబాద్
ముస్తాబాద్ మండల కేంద్రంలో పద్మశాలిల ఆరాధ్య దైవం శ్రీ మార్కండేయ జయంతి వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పురవీధుల గుండా పద్మశాలి బంధువులు మహిళలు,సంఘం సభ్యులు అంగరంగ వైభవంగా శోభయాత్ర నిర్వహించారు.భక్తులకు ఆలయంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గూడూరి భరత్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావనలు,భగవంతుని స్మరణ చేసుకోవడం నిత్యజీవితంలో నిరంతర ప్రక్రియగా కొనసాగాలని,తద్వారా మెరుగైన చైతన్యవంతమైన,సత్ప్రవర్తన కలిగి సమ సమాజం నిర్మితం అవ్వడానికి ఎంతో దోహదపడుతుందని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల పట్టణ అధ్యక్షుడు బాలకిషన్, సర్వర్ పాషా,బాలయ్య, శ్రీనివాస్, స్వామి, పద్మశాలి సంఘం సభ్యులు నందం, దశరథం, బాలరాజు, లక్ష్మీనారాయణ, భూమేష్ ,శ్రీకాంత్, శ్రీనివాస్, రాజ మల్లయ్య, ధర్మయ్య, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.