బలగం టివి , ,రుద్రంగి:
రుద్రంగి మండల కేంద్రంలోని శివ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి కుల బంధువులు మార్కండేయ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు పసుపు కుంకుమ కార్యక్రమం ఏర్పాటుచేసి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జయంతి రోజున పద్మశాలి కుల బంధువులకు అన్నదాన కార్యక్రమం మరియు వచ్చే మహిళా భక్తులకు పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పులి రాజేష్, ఉపాధ్యక్షుడు కొండ సత్తయ్య ,కార్యదర్శి ఎలిగేటి ప్రదీప్ ,కోశాధికారి బాసని ఓం ప్రకాష్, దేవాలయ కమిటీ అధ్యక్షుడు మంచే రమేష్ ,కార్యదర్శి పుల్లమరపు ప్రవీణ్ , కోశాధికారి బింగి గణేష్ మరియు పద్మశాలి సభ్యులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు..