బలగం టివి , ,ముస్తాబాద్
ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామానికి చెందిన పల్లె రమణ అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తన కొడుకుకు ఉద్యోగం రాలేదని బాధపడుతూ ఉండేదని , జీవితంపై విరెక్తి చెంది ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగిందని,కుటుంబ సభ్యులు గమనించి ఎల్లారెడ్డిపేట లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించిందని వెల్లడించారు. మృతురాలి కుమారుడు పల్లె అఖిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని ఏఎస్ఐ వెంకటరమణ పత్రికా ప్రకటనలో తెలిపారు.
