*జడ్పిటిసి నర్సయ్య,సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కిషన్ రావు.
*మాజీ మంత్రి కేటీఆర్ యిలాకలో రాజీనామాల పర్వం.
బలగం టివి ,, ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు జడ్పిటిసి గుండం నర్సయ్య, మండల సర్పంచుల పోరం అధ్యక్షుడు తెర్లుమద్ది సర్పంచ్ కిషన్ రావు ఆధ్వర్యంలో మండల నాయకులు పాత్రికేయ సమావేశం నిర్వహించి మాజీ మంత్రి యిలాకలో బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.ఈ సందర్బంగా జెడ్పిటిసి గుండం నర్సయ్య మాట్లాడుతూ నేను జెడ్పిటిసిగా ఈ ఐదు ఏండ్ల బిఆర్ఎస్ పాలనలో మండలంలోని ఒక్క గ్రామంలో కూడా నిరుపేదలకు నా వంతుగా న్యాయం చేసే విధంగా ఎలాంటి కార్యక్రమం చేద్దామన్నా..నాకు సహాయ సహకారం అందించలేదని ఫోను చేసినా,మెసేజ్ పెట్టినా ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించలేదని ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.కార్యకర్తలను నాయకులను ఎవరు ఎలా చూస్తున్నారో ప్రజలే అర్థం చేసుకుంటున్నారని తెలిపారు.వెనుకట పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇంట్ల గెలిచి రచ్చ గెలవాలని అప్పుడే ప్రజలు గుర్తిస్తారని వారు పేర్కొన్నారు. పార్టీలో చిన్న చూపు వివక్ష ఉండరాదని అందర్నీ కలుపుకుపోయే తత్వం బిఆర్ఎస్ పార్టీలో లేదని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ పార్టీ కోసం శ్రమించిన వాళ్లను పక్కన పెట్టి ఏనాడూ పార్టీ కోసం పనిచేయని వాళ్లకు మాత్రం పదవులిచ్చి అందలం ఎక్కించడం సరికాదన్నారు.మాకు సరైన గుర్తింపు లేదని అందుకే పార్టీకి రాజీనామా చేశామన్నారు. తదుపరి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తెర్లుమద్ది సర్పంచ్ కిషన్ రావు మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ సర్పంచుల పక్షాన అండగా నిలబడతానని చెప్పడం
గత పది సంవత్సరాలలో అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి నిధులు కేటాయించకుండా సర్పంచులను అప్పుల పాలు చేసి ఇప్పుడు వారి పక్షాన కొట్లాడుతా అనడం చిత్రంగా ఉందన్నారు.చిన్న చిన్న గ్రామాల సమస్యలు చెప్పుకోవడానికి సర్పంచులకు ఏ ఒక్క రోజు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని మంత్రి దగ్గరికి పోయినట్టుగా సాక్షదారాలతో నిరూపిస్తామని మండిపడ్డారు.ట్రాక్టర్లు గ్రామపంచాయతీ నిధుల నుండి తీసుకోవడం జరిగిందని బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి నిధులు ఇవ్వలేదని కొంతమంది సర్పంచులు అప్పు చేసి తీసుకున్నారని ఇప్పుడు సర్పంచులు అప్పుల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశామని ఈ సందర్బంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు కళ్యాణి భాను,దేవేందర్ నాయక్,మాజీ సర్పంచులు వేణు,అనిల్,మాజీ జెడ్పిటిసి యాదగిరిగౌడ్, ఎంపీటీసీలు వార్డు సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
