పల్లె పల్లెన మే డే సంబరాలు

0
123

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రెపరెపలాడిన ఎర్ర జెండా

ప్రపంచ కార్మిక వర్గ పోరాట దినమైన మేడేను రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండెపల్లి గ్రామంలో ఏఐటీయూసీ హమాలీ సంఘం కార్మికులు ఎర్ర జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు పాతూరు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది గంటల పని దినం కోసం ఎందరో పోరాడి అమరులయ్యారని వారి కృషి ఫలితంగానే ఈ 139 వ మే డే దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాతూరు సురేందర్ రెడ్డి, ఉప అధ్యక్షులు జగ్గాని రాములు, ప్రధాన కార్యదర్శి పన్యాల వెంకటరెడ్డి, కోశాధికారి జగ్గాని తిరుపతి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఆసాని భూపాల్ రెడ్డి, కిషన్, మల్లేశం, నాగరాజు, వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి,బంద పెద్ద ఎల్లయ్య, బెస్త శివాజీ, దసరి రవి, ఒగ్గు చిన్న మల్లేశం, నక్క రాజయ్య, గుండారపు మల్లయ్య, పోతారాజు సుదర్శన్, ధనవేణి పెద్దయ్య, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here