మే డే కార్మిక దినోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..

0
79

సిఐటియు ఆధ్వర్యంలో మే డే కరపత్రం విడుదల

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామ హమాలీల ఆధ్వర్యంలో మే డే కరపత్రం బుధవారం రోజున ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా మండల సిఐటియు కన్వీనర్ గురిజాల శ్రీధర్ మాట్లాడుతూ: మే ఒకటో తేదీన జరుపుకునే మే డే దినోత్సవం మండల కేంద్రంలో కష్టజీవుల ఎర్రజెండాను ఎగరవేయడం జరుగుతుందని, మండలంలో ఉన్న గ్రామాల అన్ని రంగాల కార్మికులు హమాలీ, భవన నిర్మాణ కార్మికులు, మహిళా బీడీ కార్మికులు, గ్రామపంచాయతీ కార్మికులు, సన్నకారు, చిన్నకారు రైతులు, ఉపాధి హామీ కూలీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు తదితర రంగాల కష్టజీవులు అందరూ ఈ కార్యక్రమానికి పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తడగొండ హమాలి కార్మికులు సంబు వీలందర్, ఇస్తారి, మేకల శీను, మేకల మహేందర్, పెద్దిగారి అశోక్, ఎండి రహీం, రాగుల శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here