పెయిడ్ న్యూస్ పర్యవేక్షణ కు జిల్లాలో ఎంసీఎంసి కమిటీ

0
111

సిరిసిల్ల న్యూస్​:

-ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి

-కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి

ప్రచార కార్యక్రమాలకు సంబంధించి అడ్వర్ టైజ్ మెంట్ లు, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, ఆడియో వీడియో డిస్ ప్లే, సినిమా థియేటర్లు, ఎఫ్ఎం రేడియో, బల్క్ ఎస్ఎంఎస్ లు, వెబ్ సైట్ లో ప్రసారం చేసే వీడియో అడ్వర్ టైజ్ మెంట్ లకు ముందస్తు అనుమతులు పొందాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి తెలిపారుప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని గురువారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

ప్రింట్,ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో వచ్చే పెయిడ్ న్యూస్ గుర్తింపునకు ప్రత్యేకంగా మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)ని సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేశామన్నారు.

జిల్లా ఎన్నికల అధికారి చైర్మన్ గా ఉన్న ఎంసీఎంసి కమిటీలో సిరిసిల్ల rdo ,dpro,cpo, edm, సీనియర్ జర్నలిస్టును నియమించామన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, శాటిలైట్ చానల్స్, లోకల్ కేబుల్ నెట్ వర్క్స్ లో ప్రసారమయ్యే అన్ని రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ కమిటీతో ముందస్తు అనుమతి పొందాలన్నారు.

పెయిడ్ న్యూస్ పై ప్రత్యేక నిఘా….

అనుమానిత చెల్లింపు కథనాల న్యూస్ కు సంబంధించి dvap, సమాచార శాఖ అందించిన రేట్ కార్డును అనుసరించి వాటికి అయ్యే ఖర్చను ఎన్నికల వ్యయంలో జమ చేయడానికిగాను ఆర్ వో ద్వారా నోటీసులు జారీ చేస్తామని అనురాగ్ జయంతి తెలిపారు.

అనుమానిత చెల్లింపు కథనాల పై అభ్యర్థుల సమాధానానికి ఎంసీఎంసీ కమిటీ సంతృప్తి చెందకపోతే ఆ ఖర్చును అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలుపుతారన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటి నుంచి పెయిడ్ న్యూస్, ప్రకటనలకు సంబంధించి వ్యయాన్ని వారిఎన్నికల వ్యయంలో కలపనున్నట్టు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here