దేశాయిపల్లి కొత్తచెరువు పరిశీలన
- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
బలగం టీవీ, తంగళ్ళపల్లి:
జిల్లాలో నీటి వనరుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తంగళ్ళపల్లి మండలం దేశాయిపల్లి కొత్తచెరువు, కట్ట పరిసరాలను బుధవారం ఉదయం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు.
స్థానిక నక్కవాగు నుంచి దేశాయిపల్లి కొత్తచెరువులోకి వచ్చే ఫీడర్ చానల్ లో డీ సిల్టింగ్ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. నీటి వనరుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఆఫీసర్ కిషోర్, డివిజన్-7 ఈ.ఈ. ప్రశాంత్, డీ.ఈ.ఈ. సత్యనారాయణ, సాగర్ తదితరులు ఉన్నారు.
