బలగం టివి, రాజన్నసిరిసిల్ల:
మేడిగడ్డ బాధ్యులపై క్రిమినల్ కేసులుపెట్టి అరెస్ట్ చేయాలి
కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తు చెయ్యండి
కాంగ్రెస్ తక్షణమే హామీలను అమలు చెయ్యాలి..
తలకాయ ఉన్నోడు బీఆర్ఎస్ తో పోత్తు పెట్టుకోరు
బీఆర్ఎస్ మునిగిపోయే నావ
దేశవ్యాప్తంగా బీజేపీకి 400 సీట్లు రాబోతున్నయ్
కాంగ్రెస్, బీఆర్ఎస్ బహిరంగ మిత్రులు
–బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్
రాజన్న సిరిసిల్ల జిల్లాకి కేంద్ర ప్రభుత్వం 1408 కోట్ల రూపాయల నిధులిచ్చాంది పెద్ద ఎత్తున మోదీ ప్రభుత్వం ఇస్తున్న నిధులను తెలుసుకుని ప్రజలే ఆశ్చర్యపోయారనీ , కేంద్రం నయాపైసా ఇయ్యలే,అభివ్రుద్ధి నిధులన్నీ రాష్ట్రా ప్రభుత్వం ఇస్తున్నదని కేసీఆర్, కేటీఆర్ ఇన్నాళ్లు చేసిన ప్రచారమంతా ఒట్టిదేనని ప్రజలు గ్రహించారు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.గురువారం విజయవంతంగా తొలిదశ ప్రజాహిత యాత్ర ముగిసిన సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బండి సంజయ్ కుమర్ మాట్లాడుతూ
మేం గ్రామాలకిచ్చిన నిధులపై పోస్టర్లు వేస్తే తప్పేంది, ఓస్వయం ప్రకటిత మేధావి ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు. మేం పోస్టర్లు వేస్తే మీరు మెడలో బోర్డులు వేసుకుని తిరుగు. ఎవరు వద్దన్నారు, నన్ను గెలికితే ఊరుకునే ప్రసక్తే లేదు,నన్న గెలికితే నీ బండారం బయట పెడతానని. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రజాహిత యాత్రను కొనసాగించాననీ, ఎక్కడికి పోయినా ప్రజలలు మోదీ గురించి మాట్లాడుతున్నారు.. తెలంగాణలో గ్రామాల అభివ్రుద్ధికి, ఇండ్ల నిర్మాణం కోసం కేంద్రం మంజూరు చేసిన నిధులను ఎందుకు దారి మళ్లించారోబీఅర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలనీ అన్నారు.14, 15 ఆర్దిక సంఘం నిధుల్లో గోల్ మాల్ జరిగిందనీ , మొక్కల పెంపకం కోసం ఇచ్చిన వందల కోట్ల నిధులనుమ దోచుకుతిన్నరనీ , ఇదేమని ప్రశ్నిస్తే జవాబు చెప్పలేక దుష్ప్రచారం చేస్తున్నరు అని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వ ఘోర వైఫల్యముందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) నివేదిక ఇచ్చినదనీ, దీంతోపాటు రాష్ట్ర విజిలెన్స్ కూడా రిపోర్ట్ ఇచ్చిందన్నారు. గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు కాళేశ్వరం సందర్శించి వచ్చారనీ, మళ్లీ కాళేశ్వరం సందర్శన, విచారణ పేరుతో ఈ డ్రామాలేందని కాంగ్రెస్ నాయకులను నిలదీశారు

గత సంవత్సరం అక్టోబర్ లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టిమ్ కాళ్లేశ్వరం ప్రాజేక్ట్ ను సందర్శించి,20 అంశాలపై వివరణ అడిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని, నవంబర్ 1న కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిందఅని అన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ నిబంధనలను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా ఉల్లంఘించిందనీ, రాష్ట్ర ప్రభుత్వ తప్పిదంవల్ల ప్రజల జీవితాలకు, ఆర్దిక వ్యవస్థకు తీవ్రమైన ప్రమాదం కలిగే అవకాశం ఏర్పడిందని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీలోని ఒక బ్లాక్ లో తలెత్తిన సమస్యవల్ల మొత్తం బ్యారేజీ సక్రమంగా పనిచేయని దుస్థితి నెలకొందనీ ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు మొత్తం బ్యారేజీని ఉపయోగించడానికి అవకాశమే లేదు అని నివేదికలో పేర్కొన్నారనీ అన్నారు.బ్యారేజీలోని బ్లాక్ నెంబర్ 7లో నెలకొన్న సమస్య మరమ్మతు చేయడానికి వీలు లేకుండా పోయిందని,ఆ బ్లాక్ మొత్తాన్ని పునాదుల నుండి తొలగించి మళ్లీ పునర్ నిర్మించాల్సిందే నానీ అన్నారు. మేడిగడ్డ బ్యారేజీలోని ఇతర బ్లాక్ లు కూడా దెబ్బతినే ప్రమాదం ఉన్నాదిమొత్తం బ్యారేజీనే పునర్ నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని,ఈ పరిస్థితి తీవ్రం కాకముందే బ్యారేజీని పునరుద్దరించాలనీ అన్నారు. కాళేశ్వరంలో ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సైతం బలహీనంగా ఉన్నాయి,ఈ బ్యారేజీల్లో సైతం మేడిగడ్డ తరహాలో సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం నెలకొందనీ, అన్నారం బ్యారేజీ దిగువన బాయిలింగ్ సమస్య సంకేతాలు కన్పిస్తున్నాయాని అన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెబుతున్నా.. మెడకాయ మీద తలకాయ ఉన్నోడెవ్వడూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోడు అని ఎందుకంటే మునిగిపోయే నావ బీఆర్ఎస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టికి ఒక్క సీటు కూడా రాదు. అయినా దేశవ్యాప్తంగా 400 సీట్లు సాధించబోతున్న బీజేపీకి బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ లేనేలేదు అని,మోదీ హవా కొనసాగుతుండటంతో తట్టుకోలేక బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి బీజేపీని దెబ్బతీసేందుకు విష ప్రచారం చేస్తున్నాయని, ప్రజలెవరూ వాటిని పట్టించుకోవద్దు’’ అన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ బహిరంగ మిత్రులేనని, గతంలోనూ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్ధిని ఓడించేందుకు కుట్ర చేశాయన్నారు.
ప్రతిసారి బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నాయని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలంతా ఆ పార్టీని వీడిపోతున్నారని తెలిసి కేసీఆర్ ఈ డ్రామాలాడుతున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకాలనీ బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేతలు చాలా మంది బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుసుకున్న కేసీఆర్ ‘బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నం. కేంద్ర పెద్దలతో మాట్లాడుతున్నా. మీరెవరూ పార్టీ వీడొద్దు.’అని మోసపూరిత మాటలతో మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారనీ అన్నారు. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు బహిష్కరించబోతున్నరనీ ఈ విషయం తెలిసే సోనియాగాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజ్యసభకు వెళుతున్నారు అని అన్నారు.