బలగం టీవి,, బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలోని రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రోజున చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంని కలిసి రెడ్డి సంఘ భవనము మిగులు పనుల కొరకై నిధులు కావాలని కోరారు.సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఫిబ్రవరి మొదటి వారంలో నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.నిధుల మంజూరుకై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేకి తడగొండ గ్రామ రెడ్డి సంఘం సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్,గ్రామ రెడ్డి సంఘం సభ్యులు గుడిశేఖర్ రెడ్డి, ఆముదాల లక్ష్మారెడ్డి, గోగురి చంద్రారెడ్డి,
గుడి శ్రీనివాస్ రెడ్డి, మిర్యాల శ్రీనివాస్ రెడ్డి, వంచ వీరారెడ్డి, శీలం రామచంద్రం, నరసింహారెడ్డి,గోగురి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.