బలగం టివి: రాజన్నసిరిసిల్ల:
క్రీడలతో దేహాదారుడ్యంతో పాటు మానసికోల్లాసం పొందుతామని రాజన్నసిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట ంమడలం మరిమడ్ల గ్రామంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.శుక్రవారం రోజున తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల, మర్రిమడ్లలో ఏర్పాటు చేసిన 2వ రాష్ట్ర స్థాయి గేమ్స్ & స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేసిన జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి గారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సర్పంచ్ అశోక్, ఎంపీటీసీ రేణుక, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజేశం, ఆర్‌సీవో వెంకన్న, ప్రిన్సిపల్ భాస్కర్, విద్యార్థులు పాల్గొన్నారు.