బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వివిధ రంగాలలో ప్రతిభను కనబరిచిన ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులను ఎల్లారెడ్డిపేట ఎంఈఓ హరికృష్ణ అభినందించారు. విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రాజన్నపేట గ్రామానికి చెందిన నమిలికొండ దేవయ్య-సంతోషి కుమార్తె ఏంజెల్ గత నెలలో నిర్వహించిన రంగోత్సవం కలరింగ్ లో జాతీయస్థాయిలో మొదటి బహుమతి సాధించింది. మండల కేంద్రానికి చెందిన కులేరి దీప్తి కుమార్-మౌనిక కుమార్తె జెస్సికా స్వీటీ స్కెచ్చింగ్ లో రాష్ట్రస్థాయి బహుమతి రాగా. కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న కులేరి కిషోర్ కుమార్-కల్పన కుమారుడు సామ్యూల్ (బబ్బి) గ్రాడ్యుయేషన్ సందర్భంగా ఎంఈఓ హరికృష్ణ అభినందించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ హరికృష్ణ మాట్లాడుతూ చదువులో రాణించి ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు పుట్టిన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువులో రాణించడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర ప్రోత్సాహం ముఖ్యమైనదని ఎంఈఓ హరికృష్ణ అన్నారు. చదువులో మంచి మార్కులు సాధిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఇంకా ప్రోత్సహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కిషన్ దాస్ పేట పాఠశాల మాజీ విద్యా కమిటీ చైర్మన్ కులేరి కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.