సిరిసిల్ల 16, డిసెంబర్ 2023
రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన సిబ్బందిని భర్తీ చేసేందుకు వీలుగా…వచ్చిన దరఖాస్తులలో అర్హులైన అభ్యర్థుల నుండి మెరిట్ లిస్ట్ వివరాలను జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఈనెల 15 నుండి ప్రదర్శిస్తునట్లు డిపిఆర్ఓ మామిండ్ల దశరథం ఓ ప్రకటనలో తెలిపారు.
జిల్లా కలెక్టర్ అనుమతితో
ఒక APRO పోస్ట్ కు సంబంధించి 1:5 నిష్పత్తిలో, ఒక పబ్లిసిటీ అసిస్టెంట్ ( ఫోటో గ్రాఫర్) పోస్ట్ కు ముగ్గురు మాత్రమే అర్హత సాధించడంతో వారి వివరాలను IDOC లోని నోటీస్ బోర్డ్ లో ప్రదర్శించినట్లు తెలిపారు. ఒక పబ్లిసిటీ అసిస్టెంట్ ( విడియో గ్రాఫర్) పోస్ట్ కు రెండు దరఖాస్తులు రాగా వారికి సరిపడా విద్యా అర్హతలు లేవని తెలిపారు.
ఒక ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ కు సంబంధించి ఎంపానల్డ్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నుంచి అభ్యర్థిని ఇవ్వవలసిందిగా సూచించినట్లు తెలిపారు.
మెరిట్ జాబితా కు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 18 వ తేదీ సాయంత్రం 05.00 గంటల లోగా ( కార్యాలయ పని వేళల్లో) జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో తెలియజేయాలని డిపిఆర్ఓ కోరారు.
ఒక APRO పోస్ట్ కు సంబంధించి 1:5 నిష్పత్తిలో, ఒక పబ్లిసిటీ అసిస్టెంట్ ( ఫోటో గ్రాఫర్) పోస్ట్ కు సంబంధించి అర్హత సాధించిన ముగ్గురు అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలోనే
ఇంటర్వ్యూ లు నిర్వహించనున్నట్లు …