ఘనంగా క్రిస్మస్ వేడుకలు..

0
43

క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఇంచార్జి కలెక్టర్

క్రిస్మస్ సెలబ్రేషన్స్, విందు

హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

ముందస్తు క్రిస్మస్ వేడుకలు సిరిసిల్లలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల పట్టణం బీవై నగర్ లోని బేతెస్థా బాప్టిస్ట్ చర్చి ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్, విందు వేడుకలు నిర్వహించగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. క్రిస్మస్ వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి రూ. రెండు లక్షలు మంజూరు చేసిందని వెల్లడించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన చర్చీల్లో రంగులు, విద్యుత్ దీపాల అలంకరణకు రూ.30 వేలు మంజూరు చేస్తుందని తెలిపారు. పండుగ నేపథ్యంలో ప్రేమ, సంతోషం పంచాలని పేర్కొన్నారు. అందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి భారతి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ స్వప్న, పలు చర్చిల ఫాదర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here