చీర్లవంచ ఎంపీటిసి నలువాల రేణుక జలంధర్ చేరిక
సిరిసిల్ల వస్త్ర వ్యాపారులు సైతం కాంగ్రెస్ లో జాయినింగ్
బలగం టివి: రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ టూ కాంగ్రెస్‌కు రాజకీయ వలసలు ప్రారంభమయ్యాయి. తంగళ్లపల్లి మండలం చీర్లవంచ ఎంపిటిసి నలువాల రేణుకజలంధర్‌తో పాటు పలవురు శుక్రవారం కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిరిసిల్ల పట్టనంల పలువురు వస్త్ర వ్యాపారులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్‌ఎస్ మాజీ కౌన్సిలర్ బూట్ల రుక్కుంభాయిసుదర్శన్ దంతపతులు సైతం కాంగ్రెస్ లో చేరారు. పాలిష్టర్ సంఘం నాయకులు.. సిరిసిల్ల ప్రముఖ వస్త్ర వ్యాపారులు బూట్ల నవీన్, సత్యనారయణ, రఘుపతి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
