బలగం టివి, తంగళ్లపల్లి
తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాలలో ఐక్యూఏసి ,మరియు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మినీ ఇంపాక్ట్ ప్రోగ్రాంనిర్వహించారు.ఈ కార్యక్రమంలో సైకాలజిస్ట్ అనిత ఇంపాక్ట్ ప్రోగ్రాం డైరెక్టర్లు సాయి బాబు , సుధాకర్ ఆవుల,తిరుపతి మరియు ఇంపాక్ట్ ట్రైనర్లు రమాదేవి, పోచవ్వ,మదన మోహనా చారి,బాలకిషన్,సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు విద్యార్థినులకు ప్రసంగాలతో భవిష్యత్తును ఎట్లా నిర్మించుకోవాలో తెలుపుతూ ప్రసంగించారు.
స్కిల్ డెవలప్మెంట్ గురించి వివరిస్తూ జీవితంలో వివిధ రకాలైనటువంటి స్కిల్స్ ని అభివృద్ధి చేసుకొని భవిష్యత్తులో కెరియర్ డెవలప్మెంట్ ని కూడా మలుచుకోవడానికి స్కిల్స్ గురించి సోదాహరణంగా వివరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రజిని మరియు వైస్ ప్రిన్సిపాల్ సుధా సింధు,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.