– శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 20 ఉద్యోగావకాశాలు..
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మినీ జాబ్ మేళా నిర్వహించబడుతున్నది. ప్రముఖ ప్రైవేట్ సంస్థ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ రాజన్న సిరిసిల్ల బ్రాంచ్‌లో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నియామకాలు చేపట్టనుంది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా లోని అన్ని మండలాల నుంచి మొత్తం 20 ఖాళీలు భర్తీ చేయబడనున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా లోని అన్ని మండలాల నుంచి 20 వరకు వేకెన్సీలు కలవు. తేదీ 19.02.2026 గురువారం సిరిసిల్ల ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి రాజన్న సిరిసిల్ల అద్వర్యంలో సిరిసిల్ల ఎంప్లాయిమెంట్ ఆఫీసు IDOC F16 నందు ఉద్యోగాలు, కల్పించేందుకు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీ నీల రాఘవేందర్ తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు నెలకు జీతం: 16,000/- నుంచి 40,000/- TA DA వేతనం ఉంటుందని తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా లోని అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువకులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ కాఫీలతో రాజన్న సిరిసిల్ల జిల్లా లోని ఎంప్లాయిమెంట్ ఆఫీసు , సిరిసిల్ల నందు తేదీ. 19.02.2026 రోజున ఉదయం 11.00 గంటలకు జరుగు మినీ జాబ్ మేళాకు హాజరుకావాల్సిందిగా నిరుద్యోగ యువకులను శ్రీ రాఘవేందర్ జిల్లా ఉపాధి అధికారి గారు కోరడమైనది మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 📞 90103 12496
ఈ అవకాశాన్ని వినియోగించుకుని యువత ఉపాధి పొందాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి నీల రాఘవేందర్ విజ్ఞప్తి చేశారు.
