అక్రమంగా మట్టి తరలిస్తున్నందుకు చర్యలు
తంగళ్లపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ ను జిల్లా మైనింగ్ శాఖ అధికారులు సీజ్ చేశారు. అక్రమంగా టిప్పర్ ద్వారా మట్టిని తరలిస్తున్నట్లు మైనింగ్ అధికారుల దృష్టికి వచ్చిందని వెంటనే స్పందించిన సహాయ సంచాలకులు సైదులు సంబంధిత టిప్పర్ ను సీజ్ చేయాల్సిందిగా రాయల్టీ ఇన్స్పెక్టర్ సైదులును ఆదేశించారు. దీంతో రాయల్టీ ఇన్స్పెక్టర్ సైదులు టిప్పర్ ను సీజ్ చేసి సిరిసిల్ల బస్ డిపో కు తరలించారు.జిల్లాలో అక్రమంగా మట్టి తరలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మైనింగ్ ఏడి సైదులు ఈ సందర్భంగా తెలిపారు.