మంత్రి కేటీఆర్​ ఫోన్​కాల్​ లీక్​.. సిరిసిల్ల విషయంలో సంచలన నిర్ణయం

0
142

మనసు మార్చుకున్న మంత్రి కేటీఆర్​..

మంత్రి కేటీఆర్​ ఫోన్​కాల్​ లీక్​..సిరిసిల్ల లీడర్లతో టెలి కాన్పోరెన్స్​

ఇక నుంచి వారానికి రెండు రోజులు సిరిసిల్ల లోనే

ప్రతి కార్యకర్తకు, ప్రజాప్రతినిధితో నేరుగా నేనే మాట్లాడుతా

ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి.. మన అభివృద్దిని గడపగడపకు తీసుకెళ్లండి

బీజేపి, కాంగ్రెస్​కు క్యాడర్​ లేదు.. ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరు

రాష్ట్రంలో బీఆర్​ఎస్​కు 100 సీట్లు వస్తున్నయ్​.. మూడవసారి అధికారంలోకి రాబోతున్నం

అసంతృప్తితో ఉన్న లీడర్లను కూడా కలుపుకోనిపొండి..ఆగం కావద్దు

ప్రతిపక్షాల ది కేవలం సోషల్​ మీడియాలో లొల్లే.. ఏం కాదు.. ప్రజలు మన వైపు ఉన్నరు

వర్కింగ్​ ప్రెసిడెంట్​గా.. రాష్ట్రం మొత్తం తిరగాల్సి ఉంటుంది కాబట్టే కాస్తా సమయం ఇస్తలేను

ఇక నుంచి ప్రతి ప్రజాప్రతినిధితో నేనే డైరక్ట్​గా ఫోన్​ కాల్​ మాట్లాడుతా.. మధ్యలో ఎవరు అవసరం లేదు..

టెలికాన్పోరెన్స్​తో సిరిసిల్ల బీఆర్​ఎస్​ లీడర్లతో మంత్రి కేటీఆర్​ మాట మంతి

బలగం టివి: రాజన్నసిరిసిల్ల:

బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, సిరిసిల్ల శాసన సభ్యుడు, మంత్రి కేటీఆర్​ మనసు మార్చుకున్నడు. సిరిసిల్ల నియోజకవర్గంలో తన నుంచి  ప్రజలు ఏం కోరుకుంటున్నరు.. ఏం ఆశీస్తున్నరో అర్థం చేసుకున్నరు. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాను.. నేను వచ్చిన రాకున్న ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి.. బీఆర్​ఎస్​ సర్కార్​ అభివృద్ది పనులను గడపగడపకు తీసుకెళ్లండి.. గడపగడపకు అంటే ఏదో ఒక కరపత్రం వారి మోహన కొట్టడం కాదు.. ప్రజలుతో మమేకం కండి కూర్చుండి మాట్లాడండి అంటూ .. మంత్రి కేటీఆర్​ చాలా స్పష్టంగా.. సిరియస్​గా మాట్లాడిన ఆడియో టేపు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతుంది.

సిరిసిల్ల బీఆర్​ఎస్​ ముఖ్య నాయకులతో, ప్రజాప్రతినిధులతో మంగళవారం ఎన్నికల ప్రచార సరళిపై టెలి కాన్పోరెన్స్​ నిర్వహించారు. మంత్రి కేటీఆర్​ బీఆర్​ఎస్​ లీడర్లకు గట్టి క్లాస్​ తీసుకున్నారు. మన పార్టీని మనమే పలచన చేసుకునే మాటలు మాట్లాడవద్దు అన్నారు. ఎవరు ఊహించనంత గొప్పగా సిరిసిల్లను అభివృద్ది చేసినం.. పేదలు ఇండ్లు కట్టిచ్చినం..గృహలక్ష్మీ ఇచ్చినం..డబుల్ బెడ్​ రూం ఇండ్లు కట్టిచ్చినం..సిరిసిల్ల లో ఫలాన వారికి పని చేయలేదు అని వెలెత్తి చూపే పరిస్థితి లేదని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు.సిరిసిల్లను జిల్లా చేసుకోని మెడికల్​ కాలేజ్​, ఇంజనీరింగ్​ కాలేజ్​, ఇతర విద్యా సంస్థలను, వైద్య సదుపాయాలను మెరుగుపరుచుకున్నమని పేర్కన్నారు.సిరిసిల్లను చూసి వేరే వాళ్లు అసూయపడేట్లు చేసిన..తాగునీటి సమస్య పరిష్కరించినం.. గోదావరి నీళ్లను తెచ్చామన్నారు.సంక్షేమ పథకాలు అందజేస్తున్నం.. పంటలు పూట్లకొద్ది పండుతున్నయ్​..రైతులు సంతోషంగా ఉన్నరని బీఆర్​ఎస్​కు ఓటు వేయకపోవడానికి కారణం అసలు లేదన్నారు. కాంగ్రెస్​ అభ్యర్థి కేకే మహేందర్​ రెడ్డి వాగులో పడి కొట్టుకుపోయేటోడు.. ఏమైన చేస్తడు.. సానుభూతి కోసం ఏమైన చేస్తడు పట్టించుకోవద్దు..అది సహజం  అన్నారు. ముస్తాబాద్​ రోడ్​ షోకు వేలాది మంది వచ్చారు..ప్రజలు సంతోషంగా ఉన్నారని గ్రహించానన్నారు. మిగిలింది వారం రోజులు.. రెండు మూడు రోజులు నియోకవర్గంలో నేను అందుబాటులో ఉండి ప్రచారంలో పాల్గొంటాను. గతంలో మాదిరిగా కాకుండా వచ్చే టర్మ్​ లో వారానికి రెండు సార్లు నేను సిరిసిల్లకు వస్తా..ప్రజలకు అందబాటులో.. అండగా ఉంటానన్నారు. మధ్యలో ఎవరు లేకుండానే నేరుగా అందరితో మాట్లాడుతానన్నారు. తాను ఎన్ని చేసిన ఏం చేసిన తాను అందుబాటులో ఉండి నేరుగా మాట్లాడాలి..కలువాలి అని కోరుకుంటున్నరని గ్రహించానని టెలికాన్పోరెన్స్​లో పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం సిరిసిల్లను చూస్తుంది.. మనం మంచి మేజార్టీ తెచ్చుకోవాలన్నారు. వాడెవడో తాను ఓడిపోతున్ననని రాసిండు.. గా స్థాయికి దిగజారిపోతున్నరు అని కేటీఆర్ తమ క్యాడర్​ తో పేర్కొన్నాడు. ఏ సమస్య వచ్చిన వచ్చే ప్రభుత్వంలో చేస్తామని చెప్పాలన్నారు. తాను రాష్ట్రమంతా తిరిగాలి ఈ ఎన్నికల్లో.. సీఎం గారు అంతా తిరగలేరు ఆయన వయసు, ఆరోగ్యం దృష్ట్యా.. అందుకే మీరే కష్టపడి తిరగండి.. పని చేయండి..అందరిని కలుపుకపొండి.. ఎవరన్న ఏమైన తిట్టిన పట్టించుకోకండి..రెచ్చగెట్టే ప్రయత్నం చేస్తరు.. ఆవేశపడకండి.. మనం ప్రజలకు వివరించే పరిస్థితిలోనే ఉండాలని మంత్రి కేటీఆర్​ బీఆర్​ఎస్​ శ్రేణులకు వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here