తుపాను నష్టంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నివేదిక సమర్పించిన మంత్రి నారా లోకేష్

0
35

బలగం టీవీ, న్యూఢిల్లీ:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన ‘మొంథా’ తుపాను కారణంగా కలిగిన నష్టంపై కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా తుపాను నష్టంపై కూలంకషంగా రూపొందించిన నివేదికను రాష్ట్ర హోంమంత్రి అనిత తో కలిసి అమిత్ షాకు సమర్పించారు.

తుపాను కారణంగా రాష్ట్రంలో అన్ని రంగాలకు కలిపి రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని లోకేష్ వివరించారు. మొంథా తుపాను వల్ల రాష్ట్రంలో 3,109 గ్రామాలు ప్రభావితమయ్యాయని తెలిపారు. మొత్తం రూ.6,356 కోట్ల నష్టంలో, NDRF మార్గదర్శకాల ప్రకారం రూ.902 కోట్లు తక్షణ ఉపశమనం మరియు తాత్కాలిక పునరుద్ధరణ పనుల కోసం అర్హమైనవిగా ఉన్నాయని ఆయన కేంద్ర హోంమంత్రికి తెలిపారు. రాష్ట్రానికి తగిన ఆర్థిక సహాయం అందించాలని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా అమిత్ షాను కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన పలువురు ఎంపీలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here