బలగం టీవీ, బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వరదవల్లిలో దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. శ్రీ రాజరాజేశ్వర జలాశయం మధ్యమానేరులో స్పీడ్ బోట్ లో ప్రయాణం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా రాష్ట్రం మంచి వర్షాలతో ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటునాన్నని, మిడ్ మానేరు ప్రాజెక్ట్ రావడం వల్ల దత్తాత్రేయ స్వామి ఆలయం చుట్టూ నీరు వచ్చాయనీ,దత్తాత్రేయ జయంతి రోజు దర్శనం కోసం వచ్చే భక్తులకు బోట్లు ఏర్పాటు చేసమన్నారు.కేవలం జయంతి రోజు మాత్రమే కాకుండా శాశ్వతంగా బోటు ఏర్పాటు చేసేలా ఇరిగేషన్ వద్ద ఫైల్ పెండింగ్ లో ఉందన్నారు.దత్తాత్రేయ స్వామి ఆశీర్వచనం అందరిపై ఉండాలని, స్వామివారిని వేడుకున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండు సంవత్సరాల ప్రజా పాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని, భవిష్యత్ లో అనేక కార్యక్రమాలు చేపట్టడానికి ఆశీర్వచనం కావాలి, ప్రజాహితం కోరే వారందరికీ ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్తున్నారన్నారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి గ్రామాల్లో కూడా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. భక్తులందరికీ దత్తత్రేయా స్వామి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, దత్తత్రెయా జయంతి సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశామని,స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి. గత మూడు రోజులుగా స్వామి వారిని భక్తులు దర్శించుకుంటున్నారని, ప్రభుత్వం తరుపున భక్తలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు.స్వామి వారి దర్శనం కోసం భక్తులకు బోటు సౌకర్యం ఏర్పాటు చేశామని, మన ప్రాంతంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు,దేవాదాయ శాఖ మంత్రుల సహకారంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. 150 కోట్లతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.




