బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల
సిరిసిల్ల పట్టణం 8వ వార్డు పెద్దూరు లో తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలు పెద్దూరు బస్టాండ్ ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని బీసీ సెల్ పట్టణ ప్రధాన కార్యదర్శి సలెంద్రీ వేణుగోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ వేడుకలో 8వ వార్డు అధ్యక్షుడు మంగ ప్రశాంత్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ మంగ కిరణ్, వార్డు ఉపాధ్యక్షులు బడుగు భరత్, వార్డు ప్రధాన కార్యదర్శి సల్లూరి సంతోష్ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు గుగ్గిళ్ల తిరుపతి గౌడ్, ఎస్సీ సెల్ పట్టణ ఉపాధ్యక్షులు ర్యాకం అనిల్, సీనియర్ నాయకులు సదాది దేవదాస్, గుగ్గిళ్ల దేవయ్య గౌడ్, సల్లూరి భూమయ్య గౌడ్, 8వ వార్డు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నీరటి శ్యామ్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు సలెంద్రి రజినీకాంత్ యాదవ్, రెడ్దిమల్ల దేవేందర్ పాల్గొన్నారు.
