బలగం టీవీ, రాజన్నసిరిసిల్ల:
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలను యూత్ కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షులు చుక్క రాజశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తంగళ్ళపల్లి గ్రామ పంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలను అందజేసి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా చుక్క రాజశేఖర్ మాట్లాడుతూ, మంత్రి పొన్నం ప్రభాకర్ కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరసింగం గౌడ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మునిగేల రాజు, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ సత్తు శ్రీనివాసరెడ్డి, తంగళ్ళపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఏగుర్ల ప్రశాంత్, సిరిసిల్ల అసెంబ్లీ సోషల్ మీడియా ఇన్చార్జ గుగ్గిళ్ళ అభినయ్, తంగళ్ళపల్లి మాజీ సర్పంచ్ ఆసాని సత్యనారాయణరెడ్డి, గుగ్గిళ్ళ భరత్, ఎడ్ల తిరుపతి, గణాధి కిషన్, పెద్దూరీ తిరుపతి, మచ్చ శ్రీనివాస్, సుద్దాల శ్రీనివాస్, రాపల్లి ఆనందం, సుద్దాల కరుణాకర్, ముక్క శ్రీనివాస్, బండి పరశురాం, చిన్నమనేని ప్రశాంత్, బైరి రమేష్, బొద్దుల రాజేష్, పయ్యావుల శ్రీనివాస్, పయ్యావుల విజయ్, సామల రమేష్, ఎడమల ప్రతాపరెడ్డి, MD హమీద్, మహిళా కాంగ్రెస్ భాగ్యలక్ష్మి, శోభ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.