- కలెక్టర్ ప్రత్యేక చొరవతో జిల్లాలో ఈ ప్రాజెక్టు అమలు
- రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రులలో 80 శాతం పెరిగిన ప్రసవాలు
- 6 నెలల క్రితం కేవలం 56 శాతమే ప్రసవాలు.
- ప్రసవాల సంఖ్య పెరగడంతో… పేదల పై తగ్గిన ఆర్థిక భారం.
- ఫలించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మార్గదర్శనం, పర్యవేక్షణ
బలగం టీవి , రాజన్న సిరిసిల్ల
జిల్లాలోని జిల్లా , ఏరియా ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంస్థాగత ప్రసవాల సంఖ్యను 80 శాతం పైగా పెంచాలన్న లక్ష్యంతో 6 నెలల క్రితం కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేకంగా చేపట్టిన “మిషన్ 80 ” సూపర్ సక్సెస్ అయ్యింది.
ప్రభుత్వ ఆసుపత్రులలో సంస్థాగత డెలివరీతో పాటు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడం ద్వారా పేదలపై ఆర్థిక భారాన్ని తగ్గించడం, అనారోగ్యం బారిన పడకుండా చూడడం ఈ మిషన్ 80 ముఖ్య ఉద్దేశ్యం. జిల్లాలో గత సంవత్సరం జులై 1 ను ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
లక్ష్య సాధన కోసం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
హై రిస్క్ కేసుల తప్ప మిగతా కేసులను మండల కేంద్రాల్లోనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన సదుపాయాలు పెంచడంతో పాటు , వైద్యులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు. మరో వైపు ANM, ఆశాలు
గర్భిణులకు ANC చెకప్ లు చేపించెలా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ANM లు, ఆశా ల ద్వారా వివరించారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సదుపాయాల వివరాలను తెలియజేశారు.
సాధారణ ప్రసవం వల్ల కలిగే ప్రయోజనాలను గర్భిణీలకు తెలియజేస్తూ , సుఖ ప్రసవానికి అవసరమైన వ్యాయామాలను సిబ్బంది దగ్గరుండి చేపించారు.
మాతృసేవా తో మరింత చేరువ….
ప్రత్యేక డ్రెస్ కోడ్ తో
ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి,
జిల్లా ఆసుపత్రి తో పాటు వేములవాడ ఏరియా ఆసుపత్రిలో మాతృ సేవా కార్యక్రమాన్ని అమలు చేస్తూ గర్భిణీలకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా అన్ని సేవలను అందిస్తున్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎన్ క్వాస్ సర్టిఫికేట్ వచ్చేలా కృషి చేస్తూ ఆసుపత్రుల బలోపేతం చేస్తున్నారు. ఫలితంగా గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రుల పై నమ్మకం పెరిగింది.
ప్రభుత్వ ఆసుపత్రులలో 80శాతం పెరిగిన డెలివరీలు
జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో అమలు చేస్తున్న మిషన్ 80 మంచి ఫలితాలను ఇస్తుంది.
ప్రభుత్వ ఆసుపత్రులలో గత సంవత్సరం సంస్థాగత ప్రసవాలు సగటు కేవలం 50 శాతం లోపే ఉండగా ప్రస్తుత సంవత్సరం ఫిబ్రవరి నెలలో 54 శాతం, జూన్ నెలలో 63 శాతం కు పెరిగింది. ప్రస్తుత నెల జులైలో ఇప్పటి వరకూ 71 శాతం, అక్టోబర్ , నవంబర్ లో 77 శాతం కు చేరుకోగా డిసెంబర్ -2023 లో 80 శాతం కు చేరుకుంది. ప్రభుత్వ ఆసుపత్రులలోనే 100 శాతం సంస్థాగత ప్రసవాలు లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతుంది.
కలెక్టర్ ప్రత్యేక చొరవతోనే….
జిల్లాలోని జిల్లా , ఏరియా ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంస్థాగత ప్రసవాల సంఖ్యను 80% పైగా పెంచాలన్న లక్ష్యంతో “మిషన్ 80 ” నీ చేపట్టారు.
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నిరంతర పర్యవేక్షణ,
ఓ వైపు క్షేత్ర సిబ్బందితో గర్భిణులను, వారి కుటుంబ సభ్యులను
ఆ దిశగా చైతన్యం చేయడం, మరో వైపు
ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు పెంపుదలతో లక్ష్యానికి చేరువయ్యాం. గత నెల 80 శాతం ప్రసవాల లక్ష్యం ను చేరుకున్నాం. కలెక్టర్ ప్రత్యేక చొరవ, సహకారం, క్షేత్ర వైద్య సిబ్బంది కృషి తో మిషన్ 80 టార్గెట్ రీచ్ అయ్యాం.
ప్రభుత్వ ఆసుపత్రులలో సంస్థ గత డెలివరీతో పాటు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడం ద్వారా పేదలపై ఆర్థిక భారాన్ని తగ్గించడం, అనారోగ్యం బారిన పడకుండా చూడగలిగాం.
-డాక్టర్ సుమన్ మోహన్ రావు,
జిల్లా వైద్యాధికారి, రాజన్న సిరిసిల్ల
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, సిరిసిల్ల చే జారీ చేయనైనది.
