ఎల్లారెడ్డిపేటలో 60% శాతం మాత్రమే మిషన్ భగీరథ పూర్తి
జిల్లా కలెక్టర్ ఆదేశాలను బేకాతర చేస్తున్న కిందిస్థాయి అధికారులు
బలగం టివి,,ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రెండు సంవత్సరాలుగా వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు. మండల కేంద్రంలో మిషన్ భగీరథ కనెక్షన్లు 60% శాతమే పూర్తి చేయగా ఆ ఉన్న కనెక్షన్లు రెండు సంవత్సరాలుగా రోడ్లపైనే నీరు వృధాగా పోతున్నాయి. కొన్ని ప్రాంతాలలో కనెక్షన్లు ఇంతవరకు ఇవ్వలేదు. ఈ విషయానిక పలుమార్లు మిషిన్ భగీరథ ఏఈ, స్థానిక పంచాయతీ కార్యదర్శి ల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకున్న పాపాన పోలేరు. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతాయని కావున మిషన్ భగీరథ వీరిని ప్రతి ఇంటికి అందించి నీటి ఎద్దడి లేకుండా చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ జయంత్ ప్రతి మీటింగ్ లో చెబుతున్న కింది స్థాయి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో చిరంజీవి, కార్యదర్శి దేవరాజ్ లను వివరణ కోరగా ఎక్కడైతే నీరు వృధాగా పోతున్నాయో వాటి ఫోటో, వీడియోలు మాకు పంపాలని, మీరు పంపిస్తే మేము చూసుకుంటామని విలేకరితో అన్నారు.వారి సిబ్బందితో తనిఖీ చేయాల్సిన అధికారులు వీడియోలు ఫోటోలు పంపాలని విలేకరులనే అడగడం పట్ల వీరి విధినిర్లక్ష్యంపు పాలనపై స్థానిక ప్రజలు నవ్వుతున్నారు.
