హైకోర్టు న్యాయవాదుల వాదనలతో రైల్వే కోర్టు నిర్ణయం
బలగం టీవీ, కాజీపేట్:
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి కాజీపేటలోని రైల్వే కోర్టు మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. చివరి నిమిషంలో హైకోర్టు న్యాయవాదులు రంగంలోకి దిగి చేసిన వాదనలు బెయిల్ మంజూరుకు కీలకంగా మారాయి.
కౌశిక్ రెడ్డికి సంబంధించి హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉందని హైకోర్టు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రిమాండ్ సరికాదని, సెక్షన్ 308(5) కింద బెయిల్‌కు అర్హత ఉందని వారు తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న రైల్వే కోర్టు మెజిస్ట్రేట్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చారు.
