ఆలయాలలో ప్రత్యేక పూజలు
నన్ను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటాను
మధ్య మానేరు గ్రామ ప్రజల సమస్యలు నెరవేరుస్తాను
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నీలోజిపల్లి,కొదురుపాక గ్రామాలలో చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంగళవారం రోజున సుడిగాలి పర్యటన చేసినారు. నర్సింగాపూర్ నుండి నీలోజిపల్లి వరకు బైక్ ర్యాలీ చేశారు.నీలోజిపల్లి, కొదురుపాక గ్రామలలో ప్రజలను కలుసుకున్నారు. మొదటిగా నీలోజిపల్లిలోని రామాలయం, శ్రీ నీలకంటేశ్వర ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినారు. తరువాత కోదురుపాకలోని ఎల్లమ్మ దేవాలయంలో ఎల్లమ్మను దర్శనం చేసుకున్నారు. అనంతరం గౌడసంఘానికి కమ్యూనిటీ హల్ కటిస్తానని హామీ ఇచ్చినారు.అక్కడినుండి బొడ్రాయి వద్దకు వచ్చి, గ్రామ దేవతల ఆశీర్వాదం తీసుకొని కొబ్బరికాయ కొట్టినారు.ప్రక్కన అంబేద్కర్ విగ్రహంకు భూమి పూజ చేసి,పదివేల రూపాయలు విరాళం అందించారు.అక్కడ ఉన్న మహిళలతో మాట్లాడి వాళ్లకు రావాలిసిన ఇండ్ల స్థలాల పట్టాలు మరియు నష్టపరిహారం సమస్యల గురించి మాట్లాడి,త్వరలోనే ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.యాదవ కులస్తులను కలిసి, బీరప్ప దేవుని గుడి వద్దకు వచ్చి దర్శనం చేసుకున్నారు. తరువాత యాదవులు ఎమ్మెల్యేకు పూలమాల వేసి, సాల్వ కప్పి సన్మానించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ: బీరప్ప గుడి, మహంకాళి గుడికి కాంపౌండ్ వాల్ కట్టిస్తానని హామీనిచ్చారు. ముంపు గ్రామాలైన కోదురుపాక నీలోజిపల్లి గ్రామ ప్రజల సమస్యలు నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. కొదురుపాకను మండలం చేయడానికి ప్రభుత్వం సుముఖత చూపిందని, త్వరలోనే మండలం చేస్తానని అన్నారు.మడెల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు.తర్వాత రజక సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు పూలమాల వేసి, సాల్వ కప్పి సన్మానించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రజక సంఘం కులస్తులతో మాట్లాడినారు.మడేలేశ్వర గుడి కోసం ఇచ్చిన రెండు ఎకరాల ఇరవై గుంటల భూమిని రజకుల పట్టా ఇస్తామని, అలాగే దోబీ ఘాట్ నిర్మాణంకు కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జోగినిపల్లి వెంకటరామారావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కూస రవీందర్, మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాగుల వంశీ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.