బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
పట్టబధ్రులది 68.51 శాతం
టీచర్లది 94.63 శాతం
పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల కోసం జిల్లా వ్యాప్తంగా 41 కేంద్రాలు ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
జిల్లాలో 677 మంది పురుషులు, 273 మంది మహిళా టీచర్లు మొత్తం 950 మంది ఉండగా,
టీచర్స్ పురుషులు 640, మహిళలు 259 మంది మొత్తం 899 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 94.63 గా నమోదయింది.
పట్టభద్రులు 13,772 పురుషులు, 8,625 మంది మహిళలు, మొత్తం 22,397 ఉన్నారు. వీరిలో 9,523 మంది పురుషులు, 5,821 మంది మహిళలు, మొత్తం 15,344 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 68.51 గా నమోదయింది.