పెద్దూరు పాఠశాలలో ‘మాక్ అసెంబ్లీ’ సందడి..
ప్రజాస్వామ్య వ్యవస్థపై విద్యార్థుల గళం.
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
స్థానిక ఎంపిహెచ్ఎస్ పెద్దూరు ఉన్నత పాఠశాలలో విద్యార్థులచే నిర్వహించబడిన ‘మాక్ అసెంబ్లీ’ కార్యక్రమం అత్యంత వైభవంగా, ఉత్కంఠభరితంగా సాగింది. పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు గుండెల్లి రవీందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సభ, నిజమైన శాసనసభను తలపించేలా సాగింది.
విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, మరియు వాక్పటుత్వాన్ని పెంపొందించడంతో పాటు.. అసెంబ్లీలో బిల్లులు ఎలా ప్రవేశపెడతారు? ఏ విధంగా చర్చిస్తారు, ఎలా ఆమోదిస్తారు, చట్టాలను ఎలా తయారు చేస్తారు అనే వాటిపై అవగాహన కల్పించడానికి మరియు విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను, ఆత్మవిశ్వాసాన్ని, భాషా నైపుణ్యాలను, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి, భయాన్ని పోగొట్టడానికి, అసెంబ్లీ సమావేశాల పూర్తి అవగాహనకు, రాజ్యాంగ గొప్పదనం గురించి తెలియజేయడానికి ఈ మాక్ అసెంబ్లీని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు గుండెల్లి రవీందర్ ఏర్పాటు చేశారు.
ఈ మాక్ అసెంబ్లీలో సభలో విద్యార్థులే గవర్నర్, స్పీకర్, ముఖ్యమంత్రి, వివిధ శాఖల మంత్రులు మరియు అధికారపక్ష ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా వ్యవహరించి నిజమైన శాసనసభ సమావేశాల వలె వాడివేడిగా చర్చను కొనసాగించి సభను మొత్తం సమర్థవంతంగా నిర్వహించారు. ప్రశ్నలు, సమాధానాలు, వాదనలు, ప్రతి వాదనలు చర్చోపచర్చల మధ్య శాసనసభ సమావేశం అత్యంత ఉత్కంఠ భరితంగా, ఉత్తేజంగా, చూడముచ్చటగా సాగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి దూస రఘుపతి, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మోతిలాల్, నెహ్రు నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భాగ్యరేఖ, గీతా నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద, ప్రత్యేక అతిథులుగా దోర్నాల భూపాల్ రెడ్డి, మచ్చ ఆనందం, పురుషోత్తం, రాఘవేందర్, ఎస్ఎంసి మాజీ చైర్మన్ తమ్మటి జీవన్ హాజరైనారు. విద్యార్థుల ప్రతిభను చూసి ఆశ్చర్యపోయారు. విద్యార్థులు ప్రదర్శించిన ఆత్మస్థైర్యం, భాషా నైపుణ్యం అమోఘమని వారు కొనియాడారు. అతిథులు విద్యార్థుల వాదోపవాదనలు, ప్రశ్నలు చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనై, విద్యార్థులను అభినందించి, ఆశీర్వదించి ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ గా మోటం అనురాధ, సీఎం గా బత్తిని లవణ్ కుమార్, స్పీకర్ గా సోమారపు శ్రీనుత, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా సదాధి హర్షిత, హోం మినిస్టర్ గా కత్తెర సంజన, అగ్రికల్చర్ మినిస్టర్ గా చక్రాల పవన్, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే లుగా కొండపల్లి శ్రావణి, జంగిటి రుచిత, మోటం రాంచరణ్, రక్షిత, అమూల్య, అపర్ణ, వేల్పుల శ్రీజ, ch వైష్ణవి, మండలి హన్సిక, మధునాల ప్రణిక్ష, R అక్షర, k సాత్విక, ప్రతిపక్ష ఎమ్మెల్యే లుగా బిట్ల శృతి, గొట్టే శ్రీనిధి, హారిక, కొండపల్లి రమేష్, లాస్యప్రియ, ch అఖిల్, సుష్మ మొదలైన విద్యార్థులు పాల్గొని ఆసక్తికరించారు.
ఈ సమావేశాన్ని ఇంత రసవత్తరంగా, సమర్థవంతంగా ఏర్పాటు చేయడానికి కారణమైన ఉపాధ్యాయుడు గుండెల్లి రవీందర్ ని, పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని, విద్యార్థులను అతిథులు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబటి రవీందర్, ఏఏపీసి చైర్ పర్సన్ తిప్పవరం సుధ, ఉపాధ్యాయ బృందం చక్రవర్తుల రమాదేవి, గుండెల్లి రవీందర్, తోట శ్రీనివాస్, జనగాం రాజమల్లు, ఇరబోయిన రవికుమార్, భాగ్యనగర్ మాధవి, లకావత్ ఉమా, బైరవాణి శ్రీ, కడర్ల కల్పన, నాగుల వీణ, నందాల శంకర్, గడ్డి మహేష్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.












