తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉందని ఎంపీ బండి సంజయ్ విష ప్రచారం చేస్తున్నారు..బోయినిపల్లి వినోద్​ కుమార్​

0
121

బలగం టివి: రాజన్న సిరిసిల్ల:

తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయద్దు*

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం*.

మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్

మొన్న జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి , ఎంపీ బండి సంజయ్ లు తెలంగాణ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి పై పచ్చి అబద్దాలు మాట్లాడి అబాండాలు వేసి విష ప్రచారం చేశారని కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు….బిజెపి కాంగ్రెస్ పార్టీలు చేసిన విష ప్రచారాలను తిప్పి కొట్టలేకపోయాము ..

నేడు ఆదివారం సిరిసిల్లలోని తెలంగాణ భవనం లో మాజీ పార్లమెంట్ సభ్యులు బోయిన్పల్లి వినోద్ కుమార్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగామాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో పెట్టించి ఇచ్చామని తాను విలేకరుల సమావేశంలో మాట్లాడితే బిజెపి ఎంపీ బండి సంజయ్ తన మాటలను తప్పుబడుతూ తెలంగాణ లో ఒకటో తారీకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారని అన్నారు.. బండి సంజయ్ మాటలకు తాను జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.. దేశంలోని మోడీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం గా..ఆర్.బి.ఐ నివేదిక ప్రకారం సొంత పన్ను వసూల్లలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని… SOTR (State Own Tax Revenue )సొంత పన్నుల రాబడులు 84.2 % నిర్ణయించబడిందని అన్నారు.. దేశంలో హర్యానా 86.9% తర్వాత రెండో రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని అన్నారు.. 2014 నుండి తెలంగాణ రాష్ట్రంలో మార్చి వరకు 3.89,675 అప్పులు చూపించామని అన్నారు.

బిజెపి పాలిత రాష్ట్రాల్లో మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక పంజాబ్ గోవా రాజస్థాన్ మధ్యప్రదేశ్ బీహార్ రాష్ట్రాలు సొంత పన్నులు వసూళ్లలో తెలంగాణకు దరిదాపుల్లో కూడా లేవని అన్నారు.. భారతదేశంలో తెలంగాణ కంటే మరో 26 రాష్ట్రాలు అప్పుల్లో తెలంగాణ కంటే ఎక్కువగా ఉన్నాయని అన్నారు… ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మార్చారని పదేపదే విష ప్రచారం చేస్తున్నారని.. తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన సంపద గురించి వాళ్లు మాట్లాడకపోవడం బాధాకరమని అన్నారు.. తెలంగాణ రాష్ట్ర లో ఎన్నో భవన నిర్మాణాలు ప్రాజెక్టులు సబ్ స్టేషన్ లు నిర్మించి ప్రజల ముందు ఉంచామని అన్నారు.. కాలేశ్వరం ప్రాజెక్టు,పాలమూరు ఎత్తిపోతలప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు భక్త రామదాసు ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని వెల్లడించారు.. కరీంనగర్ లో బండి సంజయ్ బి ఆర్ ఎస్ పార్టీ అయిపోయిందని అంటున్నాడు ..రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి కాంగ్రెస్ కే పోటీ అని..అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని అన్నారు…కానీ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం, బిఆర్ ఎస్ పార్టీ గులాబీ జెండా మాత్రమే అన్నారు.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని దీమా వ్యక్తం చేశారు.. బండి సంజయ్ రేవంత్ రెడ్డిలు విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు..

ఈ కార్యక్రమంలొ టెస్కాబ్‌ చైర్మన్‌గా కొండూరి రవీందర్ రావు గారు , జెడ్పి చైర్మన్ అరుణ -రాఘవ రెడ్డి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు,మున్సిపల్ చైర్మన్ జిందం కళా -చక్రపాణి, బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య, సీనియర్ నాయకులు బోలి రామ్మోహన్, బండ నర్సయ్య జక్కుల నాగరాజు , రాజన్న తదితరులు ఉన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here