బలగం టివి,సిరిసిల్ల :
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ప్రజా హిత యాత్ర నేడు ప్రారంభించనున్నారు . కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు. కొండుగట్ట అంజన్న అలయంలో పూజలు చేసి మేడిపల్లి నుంచి యాత్రను ప్రారంభిస్తారు. తొలి విడత యాత్ర ఈ నెల 15 వరుకు కొనసాగనుంది. తొలివిడతలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో చేపట్టనున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్ల పల్లిలో తొలివిడత ముగింపు సభను నిర్వహించనున్నారు.