బలగం టీవీ, బోయినిపల్లి:
రాబోయే ఎన్నికల్లో ముదిరాజ్ లు ఐక్యత తో ఉండి,ముదిరాజ్ ల సత్తా చాటాలని ముదిరాజ్ సంఘం నాయకులు పిట్టల రమేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం వద్ద నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నల్లమోహన్ తో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో గెలుపొందిన ముదిరాజ్ కులస్తులు వార్డు సభ్యులు గెలవడంతో,మండల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నల్ల మోహన్ మాట్లాడుతూ.. ముదిరాజ్ కులస్తులమందరం ఐక్యతతో ఉండి మరిన్ని పదవులు చేపట్టాలని కోరారు.అనంతరం పిట్టల రమేష్ మాట్లాడుతూ.. రాబోయే జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో ముదిరాజ్ కులస్తులు సత్తా చాటాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మండల అధ్యక్షులు పండుగ రమేష్, నాయకులు రెడ్డవేణి రాజు,బొజ్జ శేఖర్, రాజనర్సు,రమేష్,తిప్పరవేణి కనకయ్య, పిట్టల రమేష్,బొజ్జ ప్రభాకర్,సంఘ సభ్యులు ఉన్నారు.
