బలగం టీవి, బోయినిపల్లి :
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సర్పంచ్ అక్కెనపల్లి జ్యోతి కరుణాకర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోయినిపల్లి మండల తహశీల్దార్ పుష్పలత హాజరైనారు. ముగ్గుల పోటీలలో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి రైస్ కుక్కర్, రెండవ బహుమతి బోల్ల స్టాండ్, మూడో బహుమతి ప్రెషర్ కుక్కర్ మరియు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహ బహుమతి ఇవ్వడం జరిగింది.ముగ్గుల పోటీలో దాదాపుగా 50 మంది మహిళలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, బాలయ్యలు, ఉపసర్పంచ్ ఎర్రం శ్రీనివాస్ రెడ్డి, బొంగాని అశోక్, మంగళపల్లి కమలాకర్, పులి శేఖర్, యాగల మనోజ్, గడ్డం భార్గవ్, పాముల అక్షయ్ ఇతరులు పాల్గొన్నారు.
