బలగం టీవి…
ఈరోజు స్థానిక తొమ్మిదవ వార్డులో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యా నిలయం లో గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి గారు నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు ….
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికై మన ఊరు మనబడి వంటి కార్యక్రమాల ద్వారా విశేష కృషి చేశారు అంతేకాకుండా
విద్యార్థులు మంచిగా చదువుకోవాలంటే వారికి కడుపునిండా పౌష్టిక ఆహారం కంటి నిండా నిద్ర మంచి జ్ఞానాన్ని అందించే ఉపాధ్యాయులు ఉండాలని భావించి అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల సంక్షేమం సామాజిక అభివృద్ధి లక్ష్యంగా వివిధ సంక్షేమ హాస్టల్ లను పెద్ద సంఖ్యలో నెలకొల్పుతూ విద్యా అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిచ్చారు అని అన్నారు.
సహజంగానే సంక్షేమ హాస్టల్ లో చదువుకునే విద్యార్థులు కొత్త సంవత్సరం వంటి పండగల పూట వారి ఇంటికి దూరంగా ఉన్నామనె బావనకు ఏదో ఒక క్షణంలో లోన అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నూతన సంవత్సరం రోజున కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినిలతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని అనుకున్నామని అందులో భాగంగానే ఈరోజు నూతన సంవత్సర వేడుకలను కస్తూర్బా గాంధీ బాలికల నిలయంలో జరుపుకోవడం జరిగిందని అన్నారు..
అనంతరం విద్యార్థినులతో మాట్లాడుతూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని మన లక్ష్యాలను చేరుకునే దిశగా చదువు సాగించాలని ఇతర ఏ వ్యసనాల పట్ల ప్రభావితం కాకుండ పూర్తి ఏకాగ్రతతో చదువు కొనసాగించి అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేల విద్యార్థులు మెలగాలని అన్నారు..
భవిష్యత్తులో ఈ విద్యార్థులు వారు ఏపర్చుకున్న లక్ష్యాలను చేరుకొని మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఎంతోమందికి మార్గదర్శకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను అన్నారు..
అనంతరం 2024 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి విద్యార్థులకు కేక్ ని స్వయంగా తినిపిస్తూ నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు..
ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు..