బలగం టివి: రాజన్నసిరిసిల్ల:
సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులు గా విధులు నిర్వహించిన దండు రమేష్ గారి మరణాంతరం మంజూరు అయిన EPFO EDLI ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ మరియు పెన్షన్ మంజూరు పత్రాలను దండు రమేష్ గారి భార్య మరియు కూతురికి ఈరోజు గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి అందించారు..
ఈ సందర్భంగా గౌరవ పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి గారు మాట్లాడుతూ.
దండు రమేష్ గారు సిరిసిల్ల పురపాలక సంఘ కార్యాలయంలో పారిశుధ్య కార్మికుడిగా 12 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ దురదృష్టవశాత్తు మరణించడం జరిగిందన్నారు.
దీంతో పురపాలక సంఘ కార్యాలయం నుండి దండు రమేష్ గారికి అందించాల్సిన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
అందులో భాగంగా దండు రమేష్ గారి భార్య అయిన దండు మనెమ్మ గారికి ఉద్యోగ అవకాశం కల్పించి దండు రమేష్ గారి మరణాంతరం వారి కుటుంబ సభ్యులకు చెందవలసిన ప్రావిడెంట్ ఫండ్ (పీఫ్) మరియు పెన్షన్ కోసం మా సిబ్బందితో దరఖాస్తు చేయించగా వారికి మంజూరైన EPFO EDLI ఇన్సూరెన్స్ డబ్బులు రూ.5,39,096.00 ల మంజూరు ధ్రువీకరణ పత్రాలతో పాటు దండు రమేష్ గారి భార్య అయిన దండు మనేవ్వ కు జీవితకాలం ప్రతి నెల 2601/- రూ లు చొప్పున మరియు తన కూతురుకి ప్రతినెల 650/- రూ లు చొప్పున మంజూరు అయిన పించన్ ధృవీకరణ పత్రాలను ఈరోజు వారికి అందించడం జరిగిందన్నారు.
ఇట్టి ఇన్సూరెన్స్ మంజూరు పత్రాలను మరియు పెన్షన్ మంజూరు పత్రాలను ఈ సందర్భంగా పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి, మునిసిపల్ కమిషనర్ మీర్జా ఫాసహత్ అలీ బేగ్ గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు.
ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ సుకుమార్ గారు, సూపర్వైజర్ ఉమర్ గారు, శేఖర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.