సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి మర్యాదపూర్వక భేటీ
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిందం కళా చక్రపాణి శుక్రవారం జిల్లా ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు.
ముందుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గరీమ అగర్వాల్ ని కలిసిన చైర్‌పర్సన్, పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రాథమిక చర్చలు జరిపారు. అనంతరం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా సంభాషించారు.
ఈ పర్యటనలో చైర్‌పర్సన్ వెంట మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా మరియు వైస్ చైర్మన్ దార్ల సందీప్ ఉన్నారు. పట్టణంలోని సివిక్ పనులు, పాలన మరియు ప్రజలకు అందించే సేవలలో మరింత పారదర్శకతను తీసుకురావడానికి అధికారుల సహకారం కోరారు.
ఈ కార్యక్రమంలో చైర్‌పర్సన్‌తో పాటు పలువురు మున్సిపల్ కౌన్సిలర్ సభ్యులు పాల్గొని, తమ తమ వార్డులలో ఉన్న సమస్యల పట్ల మరియు భవిష్యత్ కార్యాచరణ పట్ల అధికారులతో చర్చించారు.

