కాంగ్రెస్‌‌ లోకి ముస్తాబాద్‌‌ జడ్పీటీసీ గుండం నర్సయ్య

0
224

రేపు ముస్తాబాద్‌‌ లో బీఆర్‌‌ఎస్‌‌కు రాజీనామా ప్రకటన.. ప్రెస్ మీట్

బలగం టివి, రాజన్న సిరిసిల్ల:

రాజన్నసిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌ ప్రతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం లో వలసలు ప్రారంభం అవుతున్నాయి. బీఆర్ఎస్‌‌ టూ కాంగ్రెస్‌‌కు బీఆర్ఎస్‌‌ క్యాడర్‌‌ జంప్‌‌ అవుతున్నారు.బీఆర్ఎస్‌‌ అధికారం కోల్పోయాక బీఆర్ఎస్‌‌ నేతలు కాంగ్రెస్‌‌ వైపు ఎదురుచూస్తున్నారు. తమను పార్టీలో పట్టించుకోలేదని, గుర్తింపు ఇవ్వలేదని పేర్కొన్నారు. ముస్తాబాద్‌‌ జడ్పీటీసీ గుండ నర్సయ్య బీఆర్ఎస్‌‌ పార్టీకి సోమవారం రాజీనామా చేస్తున్నారు. ఓ ఫంక్షన్‌‌ హాల్‌‌ లో ప్రెస్ మీట్‌‌ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. జడ్పీటీసీ గుండం నర్సయ్య తో పాటు పలువురు సర్పంచ్‌‌లు, మాజీ సర్పంచ్‌‌లు, మాజీ ఎంపిటిసిలు బీఆర్‌‌ఎస్‌‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here