-బిఆర్ఎస్ ,బిజెపి ఎన్నికలప్పుడే కనిపించే బ్యాచ్..
-ఆ తర్వాత చూద్దామన్నా దొరకరు..
-నేను మీతోనే.. మీ మధ్యే ఉంటాను.
-నాకే ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించండి.
-కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి
బలగం టివి, వేములవాడ నియోజకవర్గం:
నేను ఇక్కడే పుట్టిన,ఇక్కడే పెరిగిన, నా కట్టె కాలేవరకూ మీతోనే ఉంటా.. ఈ మట్టిలోనే కలిసిపోతా మీరే నా కుటుంబం నా భవిష్యత్తు మీచేతిలోనే పెట్టిన నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి మీ సేవ చేసుకుంటా అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ ప్రజలను అభ్యర్థించారు.గురువారం రుద్రంగి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుదేశించి మాట్లాడారు.
బిఆర్ఎస్ బిజెపి అభ్యర్థులకు ఇక్కడ ఉండేటోళ్లు కాదు..ఎన్నికలప్పుడే ఇక్కడికి వస్తారు… ఇక్కడ ఉండేది లేదు మనకు చేసేదిలేదు చూద్దామన్నా కనిపించరు సుట్టపుచూపు తీరుగా వచ్చేటోళ్లు అన్నారు..
ఎన్నికల తర్వాత బిఆర్ఎస్, బిజెపి అభ్యర్థులు ఇద్దరు వేములవాడ ప్రజలకు అందుబాటులో ఉండరని,తట్ట బుట్ట సదురుకొని కరీంనగర్ లేదా హైదరాబాదుకు వ్యాపారం కోసం వెళ్ళిపోతారని అన్నారు..మన రుద్రంగిలో అనేక సమస్యలు ఉన్నాయి అని,30 ఏళ్ల కింద ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టిన నేటికి నిర్మాణం కాకపోవడంతో ప్రజలు ఇబ్బంది అధికార పార్టీ వారికి కనపడటంలేదా అని అన్నారు.. 14 సంవత్సరాలగా అధికారం లేకున్నా మీ మధ్య ఉంటున్నా అని అన్నారు..గతంలో రుద్రంగి లో జూనియర్ కాలేజ్,వాటర్ ట్యాంక్ లు,కులసంఘాల భవనాలకు నిధులు,సిసి రోడ్లు వేశానని గుర్తు చేశారు.అధికారపార్టీ నాయకులు డబ్బును నమ్ముకుంటే నేను ప్రజలను నమ్మకున్ననాని మిమ్మల్ని నమ్ముకున్నని అన్నారు..నేను మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అన్నింటికీ అందుబాటులో ఉండే వ్యక్తిని మీతోనే ఉంటా మీ మధ్యనే నడుస్తా నాలుగు సార్లు ఓడిన అభ్యర్థిగా నాకు ఒకసారి అవకాశం ఇవ్వండన్నారు..నిండు మనసుతో ఆశీర్వదించి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను వేడుకున్నారు.
